శ్రీ సుబ్రమణ్యస్వామి మురుగ, కార్తికేయ తదితర పేర్లతో పూజలందుకొంటున్నాడు. స్వామి కైలాసాన్ని వదలి పళనికి రావలసిన కారణం గురించి పళనికి ఆ పేరు ఎలా వచ్చింది అనే అంశంపై పెక్కు గాథలు ఉన్నాయి.
చారిత్రకం: బాలసుబ్రమణియ కవి రచించిన పళని చరిత్రలో పళని ఔన్నత్యం, మహత్యం వివరింపబడినాయి. ఈ చరిత్ర 23 అధ్యాయాలతో 987 గేయాలతో కూడిఉన్నది. ఈ పుస్తకం 1628 లో రచింపబడింది.1998లో ఆలయ మండలి పరిష్కృత గ్రంథాన్ని విడుదల చేసింది. తమిళ సంగమ రచనలలో పళనిని పొదిని అని పేర్కొన్నారు. తర్వాత కాలంలో పళని అయింది.
ఔషధంగా ప్రసాదం: పళని ఆలయ ప్రసాదం చాలావిశిష్టమయింది. భక్తులు చిన్న డబ్బాలలో లభించే స్వామి ప్రసాదాన్ని ఇండ్లకు తీసుకొని వెళ్లి బంధుమిత్రులకు పంచుతారు. వారు కూడా భక్తితో ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పళని ఆలయంలోని మురుగుని విగ్రహాన్ని నవపాషాణం అనే తొమ్మిది రకాల శిలలతో రూపొందించారు. (తమిళంలో వీటిని వీరం, పూరం, రసం, జఠిలింగం, కందకం, గౌరిపాషాణం, తెల్లపాషాణం, మృదర్శింగం, శిలసత్ అంటారు). ఈ విగ్రహంపై అభిషేకం జరిపిన వస్తువులు జబ్బులు పోగొట్టే ధర్మాన్ని పొందుతాయని ఐతిహ్యం. పళని ఆలయంలో విగ్రహానికి అభిషేకం చేసిన పాలు పెరుగు ఇతర ద్రవాలను తీర్థంగా పుచ్చుకొంటే పెక్కు జబ్బులు నయమవుతాయని ప్రతీతి.
అడ్రస్సు: శ్రీదండాయుధపాణి ఆలయం, గిరి వీధి, పళని – 624 601, ఫోన్: 04545 242236
ప్రధాన దైవం : కార్తికేయుడు
To read more about south indian temples please click https://goo.gl/1hxKTs