ఆలయం వెలసిన ప్రాంతానికి నెమలిగుండ్లు అని పేరు రావడానికి సంబంధించిన గాథ: ఒకప్పుడు మయూరమహర్షి అనే ముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని విష్ణువును గూర్చి తపస్సు చేసేవాడు. అతడు ఒకనాడు తనముక్కుతో ఒక కొలను పటం గీచాడని, మరుసటి ఉదయం అక్కడ ఒక కొలను (గుండం లేదా గుండ్లు) వెలసిందని ప్రతీతి. ఆ కొలను మయూరం (నెమలి) ఆకారంతో ఏర్పడిందని, ఆకారణంగా నెమలిగుండం అని నెమలిగుండ్ల అని పేరు వచ్చిందని చెబుతారు. అక్కడ వెలసిన రంగనాయకస్వామి ఆలయం నెమలిగుండ్ల రంగనాయక క్షేత్రంగా పేరుపొందిందని చెబుతారు.

ఇతరదైవాలు: నెమలిగుండ్ల ఆలయంలో రంగనాయక స్వామితోపాటు లక్ష్మి, గణపతి,శివుడు, వీరబ్రహ్మేంద్రస్వామి, సిద్దప్ప పూజలందుకొంటున్నారు. ఇంకా పార్వతీసమేత ఉమామహేశ్వరస్వామి, కుమారస్వామి, శ్రీలక్ష్మీవేంకటెశ్వర స్వామి విగ్రహాలకు కూడా  భక్తులు పూజలు చేస్తుంటారు.

నాగుల పుట్ట: ఆలయంలో వెలసిన నాగుల పుట్ట ఎంతో విశిష్టమైనది మరియు పవిత్రమైనది. ఈ పుట్టకు ఎంతో మహత్యం ఉన్నదని , అది భక్తుల కోర్కెలను తీరుస్తునదని ప్రతీతి.

ఉత్సవాలు : రంగనాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, తెప్పోత్సవం వైభవంగా జరుగుతాయి. చైత్ర శుద్ధ పున్నమ, బహుళ పాడ్యమి, విదియలలో మూడురోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు.

వరాహ విష్ణువు:  ఆలయ గోపురంపై గంధర్వుల, గరుడ విగ్రహాలు ఉన్నాయి. వాటి మధ్య వరాహస్వామి విగ్రహాన్ని అమర్చారు. స్వామిని వరాహవిష్ణువని పిలిస్తూ పూజిస్తున్నారు.

To read more about south indian temples please click  https://goo.gl/1hxKTs

Categories: General

Related Posts

General

Phulera Dooj, 28 February 

  Phulera Dooj is a wonderful celebration of the colourful season we are in – spring time. Phulera means ‘’of flowers’’. Falling between Vasant Panchami and Holi, this festival is mostly celebrated in the North Read more…

General

फुलेरा दूज – 28 फ़रवरी – मंगलवार

  वसंत ऋतु के उल्लासपूर्ण वातावरण का एक आनंदमयी उत्सव है ‘फुलेरा दूज’। यह त्यौहार वसंत पंचमी और होली के बीच फाल्गुन मास के शुक्ल पक्ष की द्वितीया तिथि को मनाया जाता है। इसे फाल्गुन Read more…

General

శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం, బెల్లంపల్లి

  శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్యుల కులదేవత.  వాసవీ పురాణంలో వైశ్యులలో కళింగ వైశ్యులు, త్రివర్ణిక వైశ్యులనే రెండు వర్గాలు ఉన్నట్లు పేర్కొనబడినది. ఈ దేవతకు ప్రధాన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసుకొనే సమయంలో భక్తుల కోరిక మేరకు Read more…